¡Sorpréndeme!

MS Dhoni to Lead CSK IPL 2025 | సీఎస్కే ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్..ఓ బ్యాడ్ న్యూస్ | ABP Desam

2025-04-10 6 Dailymotion

 చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్..ఓ బ్యాడ్ న్యూస్. చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని నియమితుడయ్యాడు. అదేంటీ రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడుగా అంటే..అదే బ్యాడ్ న్యూస్. ఎల్బో హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కారణంగా రుతురాజ్ గైక్వాడ్ మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లకు దూరం అయ్యాడు. తద్వారా మహేంద్ర సింగ్ ధోని మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. 2023లో చివరి సారి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ రుతురాజ్ కు అప్పగించారు. 2024 సీజన్ అంతా 2025 సీజన్ లో ఇప్పటివరకూ రుతురాజే సీఎస్కే ను లీడ్ చేశారు. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 5 మ్యాచ్ లు ఆడిన చెన్నై 1 మాత్రమే గెలిచి వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. సో ధోని కెప్టెన్ అయ్యాడు కాబట్టి మిగిలిన తొమ్మిది మ్యాచుల్లో ఏమన్నా మ్యాజిక్ చేసి సీఎస్కే ను లీగ్ లో నెక్ట్స్ స్టేజ్ కు తీసుకువెళతాడేమో చూడాలి. ధోనీ కెప్టెన్సీలో చెన్నై ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇదే రికార్డు ముంబై పేరు మీద ఉండగా గతేడాది ముంబైకి ఐదుసార్లు కప్పు తెచ్చిపెట్టిన రోహిత్ శర్మ ను ఆ జట్టు యాజమాన్యం తప్పించి కెప్టెన్సీ బాధ్యతలను పాండ్యాకు అప్పగించింది. మరి ఈసారి ధోనీ ఏమైనా అద్భుతాలు చేసి చరిత్రలో మరే కెప్టెన్ కు సాధ్యపడని రీతిలో ఆరోసారి కప్పు అందుకున్న కెప్టెన్ గా నిలిచిపోతాడేమో చూడాలి.